నాగ్‌పూర్: కుల రాజకీయాలను తాను బలంగా వ్యతిరేకిస్తానని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ఓ వ్యక్తి విలువను అతడి అర్హతలు నిర్ణయిస్తాయి కాని, అతడి కులం, మతం, భాష, లింగం నిర్ధారించవని చెప్పారు. శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్సవంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
తనకు ఓట్లు కురిపించినా, కుల రాజకీయాలు చేయనని చెప్పారు. ఈ సందర్భంగా 2024లో జరిగిన ఓ సభను గుర్తు చేసుకొంటూ కులం గురించి మాట్లాడే వారిని తరిమి కొడతానని ఆనాడు తాను అన్నానన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నానని, తనను కుల నేతలు కలుస్తుంటారని చెప్పారు. ‘కానీ, నేను నా దారిలోనే నడుస్తా. నాకు ఓట్లు పడచ్చు. పడకపోవచ్చు’ అని పేర్కొన్నారు.