Jharkhand | రాంచీ, ఏప్రిల్ 2: జేఎంఎంకు కంచుకోటగా ఉన్న, పార్టీ చీఫ్ శిబు సొరేన్ ఎనిమిది సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన జార్ఖండ్‌లోని దుంకా లోక్‌సభ స్థానాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకొనేందుకు ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉన్న ది. 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన శిబు సొరేన్.. 20 19 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీ విజయాన్ని కొనసాగించేందు కు బీజేపీ ఈసారి పక్కా వ్యూహంతో శి బు సొరేన్ పెద్ద కోడలు సీతా సొరేన్‌ను త మ పార్టీలో చేర్చుకొని దుంకా నుంచి బరిలోకి దింపింది. దీంతో తమ పార్టీ కంచుకోటను నిలబెట్టుకొనేందుకు దుంకా నుంచి తన వదినపై మాజీ సీఎం హేమంత్ సొరేన్ పోటీచేస్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. దీనిపై రాష్ట్ర సీఎం, జేఎంఎం కీలక నేత చంప యీ సొరేన్ స్పందిస్తూ.. దీనిపై పార్టీ త్వ రలో నిర్ణయం తీసుకొంటుదన్నారు.
మరోవైపు హేమంత్ సొరేన్ అరెస్టు తర్వా త జార్ఖండ్ రాజకీయాల్లో ముఖ్యంగా సొరేన్ కుటుంబంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకొన్నాయి. శిబు సొరేన్ కుమారుడు, దివంగత దుర్గా సొరేన్ భా ర్య సీతా సొరేన్ గత నెల బీజేపీలో చేరా రు. ఆ వెంటనే కమలం పార్టీ సిట్టింగ్ ఎం పీని పక్కన పెట్టి మరీ ఆమెకు దుంకా లో క్‌సభ టికెట్ కేటాయించింది. హేమంత్ అరెస్టు తర్వాత ఆయన భార్య కల్పన జే ఎంఎం పార్టీలో క్రియాశీలంగా మారారు. ఇటీవల సీతా సొరేన్ బీజేపీలో చేరిన స మయంలో వీరిద్దరు పరస్పర విమర్శల తో రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కించారు. జమా స్థానం నుంచి జేఎం ఎం ఎమ్మెల్యేగా ఉన్న సీత బీజేపీలో చేరడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కల్ప న సొరేన్.. మోకరిల్లడం అనేది జార్ఖండ్‌కు చెందిన వాళ్ల డీఎన్ఏలో లేదంటూ పోస్టు పెట్టారు. దీనికి సీత సొరేన్ కూడా ఘాటుగా స్పందించారు. తన భర్త పేరు తో మొసలి కన్నీరు కార్చడం ఆపాలని కౌంటర్ ఇచ్చారు. తాను, తన పిల్లలు నిజాలను వెల్లడిస్తే, కొంత మంది రాజకీ య కలలు కల్లలు అవుతాయన్నారు.