లక్నో, జూలై 18: భారత కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుబంధ నోట్ల ముద్ర సంస్థ జారీచేసిన టెండర్ నోటీసుపై ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్(బీఆర్బీఎన్ఎంపీఎల్) జారీచేసిందని..
ఈ నోటీసు భారతీయ కరెన్సీ నోట్ల కోసం భద్రతా లక్షణాలతో కూడిన ప్రత్యేక పాలిమర్ సబ్‌స్టే షీట్ల తయారీ, సరఫరా కోసం అర్హత గల సంస్థల నుండి ప్రపంచవ్యాప్తంగా బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తోందని తెలిపారు. కరెన్సీ నోట్ల ముద్రణ భవిష్యత్తుపై ఈ చర్య ఆందోళనలు రేకెత్తించిందని పేర్కొన్నారు. అవినీతిమయమైన బీజేపీ పాలనలో ఇక కరెన్సీ నోట్లను కూడా ప్రైవేటీకరిస్తారా? కమీషన్లు తీసుకునే విధానం ఇంతటి అథమ స్థాయికి దిగజారుతుందని ప్రజలు ఊహించలేదు” అని అఖిలేశ్ విమర్శించారు.