Arvind Kejriwal | మోదీ అలా చేస్తే.. బీజేపీకి ప్రచారం చేస్తా: అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తే బీజేపీ కోసం తాను ప్రచారం చేస్తానని అన్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తే బీజేపీ కోసం తాను ప్రచారం చేస్తానని అన్నారు. ‘జనతాకీ అదాలత్’ పేరుతో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోపు మొత్తం 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందించాలని ప్రధాని మోడీకి నేను సవాల్ విసురుతున్నా. ఒకవేళ ఆయన అలా చేస్తే, నేను బీజేపీకి ప్రచారం చేస్తా’ అని అన్నారు.
కాగా, ఢిల్లీలో బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతోపాటు హోంగార్డుల జీతాలు నిలిపివేయడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. పేదలంటే బీజేపీకి వ్యతిరేకమని విమర్శించారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, ఎల్జీ పాలనలో ఉందని ఆయన ఆరోపించారు.
మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాలు విఫలమయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ‘డబుల్ ఇంజిన్’ మోడల్‌ను డబుల్ లూట్, డబుల్ అవినీతి అని ఆరోపించారు.
హర్యానా, జమ్ముకశ్మీర్‌లోని బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు త్వరలో కూలిపోతాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

