బెంగళూరు, అక్టోబర్ 20: తాను 2028 లోపు మళ్లీ కర్ణాటక సీఎం అవుతానని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి కారణంగా ప్రస్తుత ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. ‘2028లోపు నాకు సీఎం అయ్యే అవకాశం లభిస్తుంది. ప్రజలు కోరుకుంటే నేనెందుకు ము ఖ్యమంత్రిని కాకూడదు? నేను ఐదేండ్ల పాటు సీఎంగా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా’ అని పేర్కొన్నారు.
బిష్ణోయ్‌కు ఏడాదికి రూ.40 లక్షల ఖర్చు
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఇటీవల ముంబైలో మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్యతో మరోసారి వెలుగులోకి వచ్చిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. 31 ఏండ్ల బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ అతని కోసం తమ కుటుంబం ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు అతని కజిన్ రమేశ్ బిష్ణోయ్ తెలిపారు. జీవితంలో లారెన్స్ ఇలా అవుతాడని కుటుంబ సభ్యులెప్పుడూ కనీసం ఊహించ లేదని ఆయన చెప్పారు. ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టి లా చదివిన బిష్ణోయ్ తర్వాత గ్యాంగ్‌స్టర్ అయ్యాడు.