Mayawati | మేనల్లుడికి పార్టీలో కీలక బాధ్యతలు.. కండీషన్స్ పెట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
Mayawati : తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ రాజకీయ భవిష్యత్ విషయంలో బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కీలక కండీషన్స్ పెట్టారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బుధవారం ఈ వివరాలు వెల్లడించారు.
Mayawati : తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ రాజకీయ భవిష్యత్ విషయంలో బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కీలక కండీషన్స్ పెట్టారు. ఆకాష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలంటే.. ఆయన మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని కండీషన్ పెట్టారు. ఆయన రిటైర్మెంట్ తర్వాతే ఆకాష్ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించే విషయాన్నిపరిశీలిస్తామని మాయావతి స్పష్టం చేశారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. తన అల్లుడు ఆకాష్ రాజకీయ భవిష్యత్ కోసం అశోక్ సిద్ధార్థ్ రాజకీయాలు వదిలేసి, త్యాగానికి సిద్ధం కావాలని ఆమె సూచించారు. సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకొన్న తర్వాతే ఆకాష్‌కు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అశోక్ సిద్ధార్థ్‌ను మాయావతి ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా చేసిన పోస్టులో మాయావతి.. ఇతర అంశాలపై కూడా స్పందించారు. బీఎస్పీ చేపడుతున్న బహుజన ఉద్యమానికి రాబోయే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలు చాలా కీలకమైనవని అభిప్రాయపడ్డారు.
1. जैसाकि सर्वविदित है कि उत्तर प्रदेश, उत्तराखण्ड व पंजाब में विधानसभा का आमचुनाव अब बहुत नज़दीक है और ये तीनों ही राज्य, परमपूज्य बाबा साहेब डा. भीमराव अम्बेडकर के ’बहुजन समाज’ को ’शोषित से शासक वर्ग’ बनने हेतु उनके आत्म-सम्मान एवं स्वाभिमान के कारवाँ को आगे बढ़ाने के लिये…
— Mayawati (@Mayawati) September 9, 2026
పార్టీ కార్యకర్తలు, నేతలు తమ లక్ష్యాల్ని సాధించేందుకు, రాజకీయంగా ఎదిగేందుకు చిత్తశుద్దితో పని చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినట్లు ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. ఇటీవల ఆకాష్ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించే విషయంపై మాయావతి స్పందించారు. పెద్ద పదవులు చేపట్టేంత అనుభవం ఆకాష్‌కు ఇంకా లేదని, కొంతకాలం తర్వాతే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

