BRS | హనుమకొండ చౌరస్తా: ఈ నెల 17 నుంచి ప్రముఖ న్యాయవాది, ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట చైర్మన్ గుడిమళ్ల రవికుమార్ ఉద్యమకారుల ఓదార్పు యాత్రను చేపడుతున్నారు. తాడు (TADU), టీ ఆటో డ్రైవర్స్జాక్ ఈ యాత్రకు సంఘీభావాన్ని ప్రకటించాయి. హనుమకొండ కాకతీయకాలనీలోని తెలంగాణ ఉద్యమకారుల ఆఫీసులో తాడు ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఓదార్పు యాత్ర పోస్టర్లను గుడిమళ్ల రవికుమార్ ఆవిష్కరించారు. అనంతరం టీ ఆటోడ్రైవర్స్ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, ఆటో డ్రైవర్ల ఆత్మబంధు గుడిమళ్ల రవికుమార్ ఉద్యమకారుల ఓదార్పు యాత్రకు టీ ఆటోడ్రైవర్స్జాక్ పక్షాన సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపారు. తాడు రాష్ట్ర నాయకులు ఇమ్మడిశెట్టి రాజు తాడు పక్షాన ఓదార్పు యాత్రకు సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా గుడిమళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం ఆటో డ్రైవర్లుతెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 700 రోజులు బంద్ చేశారని అన్నారు. 22 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అనేకమందిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. అనేక మందికి గాయాలయ్యాయి. సకల జనుల సమ్మెకు సైరన్ 2011, ఆగస్టు 1న సైరన్ మోగించింది ఆటో డ్రైవర్లే అని గుర్తుచేశారు. ఉద్యమకారులైన ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో ఓదార్పు యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో 1969 తొలి దశ ఉద్యమకారులు హనుమాండ్లు, సాంబయ్య, ఉద్యమకారులు గోపనబోయిన రాజు, జక్కుల స్వామి యాదవ్, మేకల రవీందర్, గౌని రాజు, బరిగెల కృష్ణ మూర్తి, మాషికే కరుణాకర్, సిరికొండ సదానందం, నూరేళ్ల కుమార్, పెసరు శివ, శివ, ఐలయ్య పాల్గొన్నారు.