లక్నో: భార్య తన భర్తను కర్రతో కొట్టింది. సంచలనం రేపిన మీరట్ తరహా హత్య మాదిరిగా అతడ్ని ముక్కలుగా నరికి డ్రమ్‌లో కుక్కుతానని హెచ్చరించింది. (Wife’s ‘Drum’ Warning) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఝాన్సీకి చెందిన జూనియర్ ఇంజనీర్ (జేఈ) ధర్మేంద్ర కుష్వాహ, గోండాలోని జల్ నిగమ్‌లో పనిచేస్తున్నాడు. 2016లో బస్తీ జిల్లాకు చెందిన మాయా మౌర్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
కాగా, కూతురు పుట్టిన తర్వాత భార్య మాయ పేరు మీద మూడు వాహనాలు కొని వాయిదాలు చెల్లిస్తున్నట్లు ధర్మేంద్ర తెలిపాడు. 2022లో మాయ పేరుతో ఓ భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఇంటి నిర్మాణ కాంట్రాక్టును భార్య బంధువైన నీరజ్ మౌర్యకు ఇచ్చినట్లు చెప్పాడు. ఈ సమయంలో వారిద్దరూ దగ్గరయ్యారని ఆరోపించాడు. కరోనా సమయంలో నీరజ్ భార్య మరణించడంతో వారిద్దరి మధ్య సంబంధం మరింతగా పెరిగిందని తెలిపాడు.
మరోవైపు 2024 జూలై 7న భార్య మాయ, నీరజ్ అభ్యంతరకర స్థితిలో ఉండటం తాను చూసినట్లు ధర్మేంద్ర ఆరోపించాడు. నిలదీసిన తనను వారిద్దరూ కొట్టారని తెలిపాడు. ఆ తర్వాత మాయ ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. ఆ ఏడాది ఆగస్ట్ 25న నీరజ్‌తో కలిసి ఇంటికి వచ్చిందని, తాళం పగులగొట్టి లోపలున్న గోల్డ్ చైన్, డబ్బు తీసుకుని పారిపోయిందని ఆరోపించాడు. దీని గురించి సెప్టెంబర్ 1న పోలీసులకు పిర్యాదు చేసినట్లు చెప్పాడు.
కాగా, మార్చి 29న భార్య మాయ ఆమె ప్రియుడు నీరజ్‌తో కలిసి తనతో పాటు తన తల్లిని కొట్టారని ధర్మేంద్ర కుష్వాహ ఆరోపించాడు. ఎక్కువ మాట్లాడితే మీరట్ హత్య మాదిరిగా ముక్కలుగా నరికి డ్రమ్‌లో కుక్కుతానని ఆమె హెచ్చరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని ఆరోపించాడు. భార్య దాడి చేసి హెచ్చరించిన సీసీటీవీ వీడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశాడు.
అయితే భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని భార్య మాయ ఆరోపించింది. నాలుగు సార్లు అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి తెచ్చాడని చెప్పింది. 2024 జూలైలో తనను కొట్టడంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత విడాకుల కేసు పెట్టి తనను ఇంటి నుంచి గెంటేశాడని ఆమె ఆరోపించింది.
మరోవైపు భార్యాభర్తలైన ధర్మేంద్ర, మాయకు సంబంధించిన కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు. అయితే భర్తపై దాడి చేసి మీరట్ తరహాలో చంపుతానని భార్య హెచ్చరించిన తాజా సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Wife assaults husband with wiper over her affair. Threatens husband of murdering him with her lover in the same style as in Meerut showing him blue drum @gondapolice will you take any action or wait for him to be actually killed ?pic.twitter.com/eU8rcqPOVP
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 31, 2025