ముంబై, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రేమికుడితో కలిసి భార్య దారుణంగా హత్య చేయించిన ఘటన గడ్చిరోలి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బొగటోలా అటవీ ప్రాంతంలో ఖననం చేసిన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు.
మృతుని భార్య, ఆమె ప్రేమికుడితో సహా ఇంకో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మృతుడు జితుకన్వర్ (30)ను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జత్కన్హార్ నివాసిగా గుర్తించారు.