Karwa Chauth | కర్వాచౌత్ నాడు పుట్టింటికి వెళ్లిన తన భార్య తిరిగి రాలేదన్న కారణంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (UP) రాష్ట్రం బరేలీ (Bareilly)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భుటా పోలీసు స్టేషన్ పరిధి (Bhuta police station area)లోని గుగా గ్రామానికి (Guga village) చెందిన ప్రమోద్ కుమార్ భార్య ప్రీతి రెండు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. అయితే, బుధవారం కర్వాచౌత్ సందర్భంగా ఇంటికి రావాలని భార్యను కోరాడు. ఈ విషయంపై తన అత్తగారితో వాగ్వాదానికి దిగాడు. అయితే, ప్రమోద్ భార్య మాత్రం ఇంటికి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన అతడు.. ఇంట్లోని తన గదిలో బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ప్రమోద్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గది తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
బుధవారం దేశవ్యాప్తంగా మహిళలు కర్వాచౌత్ (Karwa Chauth) వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ మహిళలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు నిర్వహించి చంద్రుడి దర్శనం చేసుకుంటారు. జల్లెడలో ముందుగా చంద్రుడిని చూసి ఆ తర్వాత భర్త ముఖాన్ని చూస్తారు. భర్త ఆశీర్వాదాల అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు.
Also Read..
Israel: గాజా సిటీని చుట్టుముట్టిన ఇజ్రాయిల్ దళాలు.. భారత సంతతి సైనికుడి మృతి
Shreyas Iyer | అయ్యర్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు.. సెలబ్రేషన్ వీడియో చూశారా..?
Varun Raj | అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తిపోట్లు.. స్పందించిన యూఎస్ అధికారులు