హిందీ భాష తెలిసినోళ్లకు చైనా సైన్యంలో రెడ్ కార్పెట్..
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో డ్రాగన్ ఓ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. హిందీ తెలిసిన గ్రాడ్యుయేట్లను సైన్యంలో ఎక్కువగా భర్తీ చేస్తోంది. సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? అన్న విషయాన్ని తొందరగా ఆరా తీయడానికి హిందీ తెలిసిన గ్రాడ్యుయేట్లను సైన్యంలో చేర్చుకుంటోంది.
ఇప్పటికే ఈ ప్రాసెస్ను చైనా సైన్యం ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దీనిని మరింత ఉధృతంగా చేయాలని తలపోస్తోందని కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సరిహద్దు భద్రతను చూస్తున్న మిలటరీ అధికారులు కొన్ని యూనివర్శిటీలను కూడా పర్యటించినట్లు తెలుస్తోంది.
చైనా సైన్యంలో హిందీ అనువాదకుడిగా చేరితే… అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్న భరోసాను చైనా ఆర్మీ అధికారులు విద్యార్థులకు వివరిస్తున్నారు. అలాగే వారిని సైన్యంలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలను కూడా ప్రారంభించారు.
కౌంటర్ ఇస్తున్న భారత ఆర్మీ
ఇక,… భారత్ కూడా ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తోంది. భారత సైనికులకు చైనా భాషను నేర్పించే పనిలో నిమగ్నమైపోయింది. ఈ దిశగా అడుగులు కూడా పడినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతంలో విధులు నిర్వర్తించే జవాన్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు.
ఐటీబీపీలో దాదాపు 90 వేల మంది సైనికులున్నారు. వీరందరికీ చైనా భాషను నేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఏదైనా ఘర్షణ తలెత్తితే, చైనా సైనికులతో నేరుగా చైనా మాట్లాడితే, వాతావరణంలో మార్పులుంటాయన్నది భారత వ్యూహం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

