న్యూఢిల్లీ : భారరహిత స్థితిలోకి వచ్చామని తెలియజేయడానికి క్యాప్సుల్‌లో సూచికగా ఐదించుల బేబీ స్వాన్ ‘జాయ్’ (హంస పిల్ల) బొమ్మను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే క్యాప్సుల్ గురుత్వాకర్షణ శక్తిలేని ప్రాంతానికి చేరుకొంటుందో ఈ హంస గాలిలో తేలుతుంది. భారతీయుల పురాణాల ప్రకారం జ్ఞానానికి ఆరాధ్యదైవంగా సరస్వతీమాతను కొలుస్తారు.
హంస ఆ దేవీ వాహనం. పాలను, నీళ్లను వేరుచేసే కచ్చితమైన వివేచన, స్వచ్ఛత, జ్ఞానం వంటి సుగుణాలు హంసకు సొంతం. అంతరిక్ష మిషన్‌లో విజయం సాధించాలంటే ఈ గుణాలు ముఖ్యమనే దానికి సూచనగానే ఈ జాయ్‌ను సిద్ధం చేశారు. భారత్, అమెరికా, పోలండ్, హంగేరీకి చెందిన క్రూ సభ్యుల బలం, ఐక్యతను కూడా ఇది ప్రతిబింబిస్తుంది.