Mallikarjun Kharge | న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై ప్రధాని మోదీ మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆయన మౌనం ప్రజల పుండ్లపై కారం చల్లినట్టు ఉన్నదని ధ్వజమెత్తింది. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ‘హింస చెలరేగిన నెల తర్వాత హోంమంత్రిని మీరు అక్కడికి పంపారు. ఆయన అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత కూడా హింస కొనసాగుతున్నది. మీ ‘యాక్ట్ ఈస్ట్’ ప్రతిపాదన ఏమైంది? ప్రధానిగా కనీసం మీరు శాంతి కోసం విజ్ఞప్తి చేయాల్సింది. మీరు మణిపూర్ను మోసం చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
వివిధ రంగాల ప్రముఖులతో కమిటీ
మణిపూర్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం గవర్నర్ అధ్యక్షతన శాంతి కమిటీ వేసింది. కమిటీలో ఆ రాష్ట్ర సీఎం, కొందరు మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ సివిల్ సర్వెంట్లు, విద్యావేత్తలు, సమాజ సేవకులు, కళాకారులకు చోటు కల్పించారు.