అయోధ్య: అయోధ్యలో జనవరి 22వ తేదీన జరగనున్న శ్రీరాము ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఇఆవళ అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధిలో కొత్త స్థాయికి చేరాలంటే, ఆయా దేశాలు తమ వారసత్వాన్ని మరిచిపోరాదు అని ప్రధాని అన్నారు. ఇన్నాళ్లూ రామ్ లల్లా ఓ టెంట్ కింద ఉన్నారని, ఇప్పుడు ఆయనకు పక్కా ఇళ్లు వచ్చిందన్నారు. తమ సర్కారు 4 కోట్ల మంది పేదలుకు పక్కా ఇళ్లు అందజేసిందన్నారు.
అయోధ్య ధామ్ నిర్మాణం ప్రతి రామ భక్తుడికి అంకితం అవుతుందన్నారు. దేశం కోసం నవ సంకల్పం తీసుకోవాలన్నారు. జనవరి 22వ రోజున దేశ ప్రజలందరూ తమ ఇండ్లల్లో రామ జ్యోతిని జ్వలించాలని కోరారు. దీపావళి వేడుకను నిర్వహించుకోవాలన్నారు. రామాలయ నిర్మాణం ప్రారంభమైన తర్వాత ప్రజలు తమ వీలుకు తగినట్లు అయోధ్యను విజిట్ చేయాలని కోరారు.
తొలి అమృత్ భారత్ రైలు అయోధ్య నుంచి ప్రయాణిస్తోందన్నారు. ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరిగిందన్నారు. వారసత్వం మనకు సరైన మార్గం చూపుతుందని తెలిపారు.