న్యూఢిల్లీ, డిసెంబర్ 17: బీజేపీ అధ్యక్షునిగా జేపీ నడ్డా వారసునిపై పార్టీలో చర్చ ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ చీఫ్గా ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రముఖంగా విన్పిస్తున్నది.
ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు మెండుగా ఉన్న మంత్రి నితిన్ గడ్కరీ కూడా రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వారికీ ఈ పదవి రావచ్చునని పార్టీలో ప్రచారం జరుగుతున్నది.