Gujarat CM | అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగా రాజీనామా చేసిన గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ వారసుడిగా పాటిదార్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ వర్గాల కథనం. వివాదాస్పద లక్షద్వీప్ అండ్ దాద్రా హవేలీ అండ్ డామన్ అండ్ డయూ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ నూతన సీఎం రేసులో ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
తదుపరి సీఎం పదవి కోసం ప్రఫుల్ ఖోడా పటేల్‌తోపాటు ఇద్దరు కేంద్రమంత్రులు, రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆర్సీ ఫాల్డు పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నదని తెలియవచ్చింది. సీఎంగా విజయ్ రూపానీ రాజీనామా చేయడం చాలా మందికి షాక్నిచ్చినా.. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే.. పథకం ప్రకారం జరిగినట్లు సమాచారం.
ఇంతకుముందు 2017లో ఎన్నికలు జరుగడానికి 16 నెలల ముందు అంటే 2016లో ఆనందీబెన్ పటేల్‌ను సీఎంగా తప్పించిన బీజేపీ అధిష్ఠానం.. విజయ్ రూపానీకి బాధ్యతలు అప్పగించిన సంగతిని బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సీఎంగా విజయ్ రూపానీ రాజీనామా చేయడానికి ముందు బీజేపీ గుజరాత్ ఇన్చార్జి భూపేంద్ర యాదవ్, కేంద్రమంత్రులు మాన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాతే విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తదుపరి గుజరాత్ సీఎంగా ఎవరిని నియమించాలన్న అంశంపై బీజేపీ అధిష్ఠానం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కానీ వ్యక్తిని కూడా నియమించడానికి ముందుకు రావచ్చునని సమాచారం. వీరిలో ప్రఫుల్ ఖోండా పటేల్ టాప్ కంటెండర్‌గా ఉన్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ తుది నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర మంత్రులు మాన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలాలతోపాటు ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆర్సీ ఫాల్డు పేర్లు చర్చకు వస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ వంటి విపక్షాలు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాటిదార్లను తమ హక్కున చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు వినికిడి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
IT Returns | బిగ్ రిలీఫ్.. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించిన కేంద్రం
RBI rule on ATM | గ్రామీణులకు షాక్.. ఏటీఎంలు ఎత్తేస్తున్న బ్యాంకులు?!