Karnataka | కర్నాటక ముఖ్యమంత్రిని మార్చనున్న అధిష్ఠానం?
కర్నాటక ముఖ్యమంత్రిని బీజేపీ అధిష్ఠానం మరోసారి మార్చబోతోందా ముఖ్యమంత్రిగా ఉన్న బసవ రాజ్ బొమ్మై స్థానంలో

కర్నాటక ముఖ్యమంత్రిని బీజేపీ అధిష్ఠానం మరోసారి మార్చబోతోందా ముఖ్యమంత్రిగా ఉన్న బసవ రాజ్ బొమ్మై స్థానంలో ఇతరులను కూర్చోబెట్టనుందా ఈ వ్యాఖ్యలను కర్నాటక బీజేపీలోని కొందరు నేతలు పూర్తిగా సమర్థిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసరాజ బొమ్మై మోకాళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నారని, చికిత్స నిమిత్తమై విదేశాలకు వెళ్లనున్నారని బీజేపీలోని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఎవరూ, ఎక్కడా బయటకు వెల్లడించడం లేదు. మరోవైపు తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో ముఖ్యమంత్రి బొమ్మై చాలా భావోద్వేగంగా ప్రసంగించారు.
”ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. పదవి కానీ, హోదా కానీ… ఇవేవీ శాశ్వతం కావు. ఈ జీవితమే శాశ్వతం కాదు. ఎన్నాళ్లు భూమిపై ఉంటామో కూడా ఏ ఒక్కరికీ తెలియదు. పదవులు శాశ్వతం కానేకావు. ప్రతి చిన్న విషయంలో నేను చాలా బహుపరాక్తో ఉంటాను. ఈ విషయాలన్నీ నాకు తెలిసినవే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనే కొందరు బీజేపీ నేతలు ఉటంకిస్తున్నారు. బసవరాజ బొమ్మై స్థానంలో మరో కొత్త వ్యక్తి సీఎం బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. గతంలో తాను అనేక మంత్రి పదవులు నిర్వహించినా, బసవరాజ బొమ్మైగానే ప్రజలందరికీ గుర్తుండిపోతానని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చినా, మీలో ఒకడిగానే తనను తాను భావించుకుంటానని, పదవులేవీ శాశ్వతం కావని ముఖ్యమంత్రి బొమ్మై నియోజకవర్గ ప్రజలతో వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

