న్యూఢిల్లీ, డిసెంబర్ 9: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం గడిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాశ్ విజయ్‌వర్గీయ పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
రాజస్థాన్ సీఎం రేసులో తాను లేనని బీజేపీ ఎమ్మెల్యే బాబా బాలక్‌నాథ్ ప్రకటించారు. మాజీ సీఎం వసుంధరా రాజే, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, దియా పేర్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణ్ సింగ్, రామ్విచ్చర్ నేతమ్, సరోజ్ పాండే, రేణుకా సింగ్ వంటి వాళ్లు సీఎం పదవి కోసం ప్రధానంగా పోటీపడుతున్నారు.