Tiger cubs video | జూపార్కులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన వైట్ టైగర్ రక్ష.. పులి పిల్లల తొలి వీడియో రిలీజ్ చేసిన జూ అధికారులు
Tiger cubs video | ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణంలోగల మైత్రిబాగ్ జూపార్కులో తెల్లపులి రక్ష మూడు పిల్లలకు జన్మినిచ్చింది. నెలన్నర క్రితం జన్మించిన ఈ మూడు పులి పిల్లలకు సంబంధించిన తొలి వీడియోను జూపార్కు అధికారులు తాజాగా విడుదల చేశారు.
భిలాయ్: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణంలోగల మైత్రిబాగ్ జూపార్కులో తెల్లపులి రక్ష మూడు పిల్లలకు జన్మినిచ్చింది. నెలన్నర క్రితం జన్మించిన ఈ మూడు పులి పిల్లలకు సంబంధించిన తొలి వీడియోను జూపార్కు అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మైత్రిబాగ్ జూ ఇన్చార్జి ఎన్కే జైన్ మీడియాతో మాట్లాడారు.
‘ఈ మూడు పులి పిల్లలు నెలన్నర క్రితం జన్మించాయి. 1997లో నందన్‌కానన్ జూపార్కు నుంచి తీసుకొచ్చిన ఆడపులి రక్ష, మగపులి సుల్తాన్ ఈ మూడు పులి పిల్లలకు జన్మనిచ్చాయి. గతంలో కూడా ఈ రెండు పులుల జంట చాలా పిల్లలను కన్నది. వాటిలో 12 పులి పిల్లలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జూపార్కులకు తరలించాం’ అని జైన్ చెప్పారు.
గత ఏడాది నవంబర్‌లో కూడా తమ జూలో జన్మించిన రెండు నెలల వయస్సున్న ‘సింగమ్’ అనే పులిపిల్లను జూ ఎన్‌క్లోజర్‌లో వదిలిపెట్టామని జైన్ వెల్లడించారు. సింగమ్ గత ఏడాది సెప్టెంబర్ 5న జన్మించిందని చెప్పారు. రోమా అనే ఆడపులి, సుల్తాన్ అనే మగపులి సింగమ్‌కు జన్మనిచ్చాయని తెలిపారు. కొవిడ్ మహమ్మారి కారణంగా గతంలో రెండేళ్లపాటు పులుల మధ్య బ్రీడింగ్ నిలిపేశామని, ఆ తర్వాత నుంచి మళ్లీ బ్రీడింగ్ మొదలుపెట్టామని పేర్కొన్నారు.
#WATCH | Chhattisgarh | A white tigress, Raksha gave birth to three cubs around 1.5 months back at Maitri Bagh Zoo in Bhilai. The Zoo Authority released the first visuals of the cubs on 12th June.
(Video: Maitri Bagh Zoo) pic.twitter.com/KfOzLa457g
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 13, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

