బెంగుళూరు : ధర్మస్థలి(Dharmasthala) సామూహిక ఖననాలకు చెందిన కేసులో ఫిర్యాదు ఇచ్చిన విజిల్‌బ్లోయర్ వ్యక్తిని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసును బయటపెట్టిన వ్యక్తిని సిట్ బృందం పది రోజుల కస్టడీలోకి తీసుకున్నది. బెల్తంగడీ కోర్టులో అతన్ని ఇవాళ హాజరుపరిచారు. పది రోజుల కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుడు రాసిన లేఖ ప్రకారం 18 పాయింట్లలో.. 17 ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు.
గత రెండు దశాబ్ధాల్లో వందల సంఖ్యలో రేప్, మర్డర్ ఘటనలు జరిగాయని, హత్యకు గురైన వారిని ఖననం చేసినట్లు ఆ ఫిర్యాదుదారుడు పేర్కొనడంతో ఆ కేసు సంచలనంగా మారింది. అయితే చివరకు ఓ కళేబరం దొరికినా.. అది తాను పూడ్చిపెట్టిన వ్యక్తిది కాదు అని అతను చెప్పాడు. పొంతన లేని సమాధానాలు చెప్పిన ఆ ఫిర్యాదుదారుడిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.
#WATCH | Dakshina Kannada, Karnataka: The whistleblower in the Dharmasthala case has been sent to SIT police custody for 10 days.
Visuals from outside Belthangady Court. pic.twitter.com/AicSDr8XON
— ANI (@ANI) August 23, 2025