Watch: ఆసుపత్రిలో పేపర్ చదువుతూ… కుప్పకూలి వ్యాపారవేత్త మృతి
గమనించిన ఆ క్లీనిక్ సిబ్బంది వెంటనే దీలీప్ కుమార్‌కు సహాయం చేసేందుకు పరుగున వచ్చారు. ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
జైపూర్: ఆసుపత్రిలో పేపర్ చదువుతూ ఒక వ్యాపారవేత్త ఉన్నట్టుండి కుప్పకూలి గుండెపోటుతో మరణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని బార్మర్‌కు చెందిన వ్యాపారవేత్త దిలీప్ కుమార్ మదానీ, పంటి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానికంగా ఉన్న ఒక పళ్ల డాక్టర్ వద్దకు వెళ్లారు. ఆ క్లీనిక్ రిసెప్షన్ వద్ద కూర్చొని అక్కడున్న వార్తాపత్రిక చదువుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఒక పక్కకు ఒరిగిన ఆయన కిందపడ్డారు.
మరోవైపు గమనించిన ఆ క్లీనిక్ సిబ్బంది వెంటనే దీలీప్ కుమార్‌కు సహాయం చేసేందుకు పరుగున వచ్చారు. ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ వ్యాపారవేత్త అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, ఆ పంటి ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अखबार पढ़ते-पढ़ते अचानक आई मौत
◆ डॉक्टर के पास गए थे बिजनेसमैन, बैठे- बैठे जमीन पर गिर पड़े
◆ घटना राजस्थान के बाड़मेर की है#ViralVideos pic.twitter.com/cOcf5FluDx
— News24 (@news24tvchannel) November 7, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

