WhatsApp Down | మెటాకు చెందిన ప్రముఖ మెసింజర్ యాప్ వాట్సాప్ (WhatsApp) సేవల్లో అంతరాయం (WhatsApp Faces Outage) ఏర్పడింది. భారత్ (India)లోని యూజర్లు (Users) యాప్‌ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఎదురైన సమస్యలపై వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
డౌన్ డిటెక్టర్ (Downdetector) వెబ్సైట్ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తింది. వాట్సాప్ సేవల్లో అంతరాయంపై దాదాపు 410కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. వాట్సాప్‌లో మెసేజ్‌లు వెళ్లడం లేదని, స్టేటస్లు కూడా అప్లోడ్ కావడం లేదని పేర్కొంటున్నారు. దీంతో వారంతా తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు తెలిపారు. దాదాపు 54 శాతం మంది యూజర్లు సర్వర్ కనెక్షన్లో సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. 24 శాతం మంది డెస్క్‌టాప్‌లో, 22 శాతం మొబైల్ యాప్‌లో అంతరాయాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. యూజర్ల ఫిర్యాదులతో సోషల్ మీడియాలో ‘వాట్సాప్ డౌన్..’ (WhatsApp Down) హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
Also Read..
Ganesh Visarjan | గణేశ్ నిమజ్జనంలో దొంగల చేతివాటం.. 100కిపైగా ఫోన్లు, బంగారు ఆభరణాలు చోరీ
Restaurant Staff | హోటల్ సిబ్బంది, కస్టమర్ల మధ్య ఘర్షణ.. షాకింగ్ వీడియో
Rekha Gupta | ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త.. ఢిల్లీ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు