భోపాల్, జూన్ 21: ‘కశ్మీర్‌ను భారత్ కనుక పాకిస్థాన్‌కు అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే’ అని మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్న అడిగారు. జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా అభ్యర్థులకు నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. ఒక ఆప్షన్లో ‘అవును, అప్పగిస్తే చాలా డబ్బు భారత్‌కు మిగులుతుంది’ అని ఇచ్చారు. రెండో ఆప్షన్లో ‘లేదు, అలా చేస్తే అలాంటి మరిన్ని డిమాండ్లు వెల్లువెత్తుతాయి’ అని ఇచ్చారు. ఇంకో ఆప్షన్లో పై రెండూ సరైనవే.. అని, మరొకటి.. పై రెండూ సరైనవి కాదు. అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ అంశం తీవ్ర వివాదమైంది. దీంతో పేపర్ తయారుచేసిన ప్రొఫెసర్, మోడరేటర్లను బ్లాక్ లిస్టులో పెడుతూ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వీరిద్దరినీ డీబార్ చేశామని, ఈ ప్రశ్న అడగటం సరికాదని, వివరణ ఇవ్వాల్సిందిగా ఎంపీపీఎస్సీ, ఉన్నత విద్యా శాఖకు లేఖ రాశామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఆ ప్రశ్నను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్, జూన్ 21: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా, పుల్వామా జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది కూడా ఉన్నాడు.