West Bengal | పశ్చిమబెంగాల్లో మంత్రులకు శాఖల కేటాయింపు.. ఆమెకు గృహనిర్మాణ శాఖ..!
West Bengal | పశ్చిమబెంగాల్ (West Bengal) లో మంత్రులకు శాఖలు (Portfolios) కేటాయించారు. సీఎం సువేందు అధికారి (CM Suvendu Adhikari) హోంశాఖను తన వద్దే ఉంచుకున్నారు. గతంలో ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం గడిపి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న కలితా మాఝీ (Kalita Majhi) కి గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. బెంగాల్ ఎన్నికల్లో తూర్పు వర్ధమాన్ జిల్లా ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి కలితా టీఎంసీ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
West Bengal : పశ్చిమబెంగాల్ (West Bengal) లో మంత్రులకు శాఖలు (Portfolios) కేటాయించారు. సీఎం సువేందు అధికారి (CM Suvendu Adhikari) హోంశాఖను తన వద్దే ఉంచుకున్నారు. గతంలో ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం గడిపి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న కలితా మాఝీ (Kalita Majhi) కి గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. బెంగాల్ ఎన్నికల్లో తూర్పు వర్ధమాన్ జిల్లా ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి కలితా టీఎంసీ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోవైపు జర్నలిస్ట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన స్వపన్ దాస్‌గుప్తాకు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు.
ఇక మిగతావాళ్లలో తపస్ రాయ్‌కి పరిశ్రమలు, వాణిజ్య శాఖలు అప్పగించారు. దిలీప్ ఘోష్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలను కట్టబెట్టారు. ఇక సీనియర్ నాయకురాలు అగ్నిమిత్ర పాల్‌కు పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల శాఖల బాధ్యతలు అప్పజెప్పారు. డాక్టర్ శరద్వత్ ముఖర్జీకి ఆరోగ్య శాఖ కేటాయించారు. జగన్నాథ్ ఛటోపాధ్యాయకు ఉన్నత విద్యాశాఖ. దూద్ కుమార్ మండల్‌కు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. దీపక్ బర్మన్కు పాఠశాల విద్యాశాఖ బాధ్యతలు కట్టబెట్టారు.
శంకర్ ఘోష్‌కు పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు అప్పగించారు. అర్జున్ సింగ్‌కు కార్మిక శాఖ, రవాణా శాఖలను కట్టబెట్టారు. ఇంద్రనీల్ ఖాన్‌కు క్రీడలు, యువజన, వినియోగదారుల వ్యవహారాల శాఖలను కేటాయించారు. మాలతీ రావరాయ్కి మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

