కోల్కతా, ఆగస్టు 5: రాష్ర్టాన్ని విభజించే ఏ ప్రయత్నాన్ని అయినా వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ సహకార సమాఖ్య వ్యవస్థను తాము విశ్వసిస్తామని, రాష్ర్టాన్ని విభజించే ఏ ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ప్రయత్నాలను తాము కూడా వ్యతిరేకిస్తామని బీజేపీ పక్ష నేత సువేందు అధికారి పేర్కొన్నారు. ఒక లైన్ను తీర్మానంలో చేర్చాలన్న ఆయన ప్రతిపాదనను సీఎం అంగీకరించడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.