Attack on Prakash Jha | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సినిమా నిర్మాత ప్రకాశ్ ఝా ముఖానికి బజరంగ్దళ్ సభ్యులుగా భావిస్తున్న కొందరు దుండుగులు సిరా పూశారు. భోపాల్‌లో ఆయన నిర్మిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ స్పాట్‌కు నిప్పంటించేందుకు ఆదివారం వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
ప్రకాశ్ ఝా నిర్మిస్తున్న ఆశ్రమంలో నటిస్తున్న బాబీ డియోల్ కోసం బజరంగ్ దళ్ కార్యకర్తలు వెతికారు. బాబీ డియోల్ హిందూయిజంపై దాడి చేస్తున్నారని, ఈ ఆశ్రమం అనే వెబ్ సిరీస్ టైటిల్ మార్చే వరకు దాని షూటింగ్‌ను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ప్రకాశ్ ఝా ముఖానికి రంగు పూసిన దుండగులు.. షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన వారిలో ఒకరినైనా పట్టుకుని తీవ్రంగా కొట్టాలని తలపోశారు.
అయితే, తనపై దాడి విషయమై ప్రకాశ్ ఝా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. వెబ్‌సిరీస్ టైటిల్ పేరు మారుస్తామని హామీ ఇచ్చారని బజరంగ్దళ్ నేత ఒకరు చెప్పారు. ఆందోళనకారులు.. ప్రకాశ్ ఝా ముర్దాబాద్.. బాబీ డియోల్ ముర్దాబాద్.. జై శ్రీరాం అని నినాదాలు చేశారు.
దేశభక్తి ప్రాధాన్య సినిమాలు నిర్మించిన సన్నీ డియోల్ నుంచైనా నేర్చుకోవాలని ఆయన సోదరుడు బాబీ డియోల్‌కు సూచించారు. ఇదిలా ఉంటే, షూటింగ్‌కు అంతరాయం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కానీ దీనిపై ప్రకాశ్ ఝా టీం సభ్యులెవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
Activists of the Bajrang Dal allegedly went on the rampage during the ongoing shooting of Prakash Jha directed web series Ashram-3 in Bhopal, ransacking property, including vehicles and also assaulting crew members @ndtv @ndtvindia pic.twitter.com/VbQvGtxqOy
— Anurag Dwary (@Anurag_Dwary) October 24, 2021
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
United Nations : చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
Honeytrap : హనీట్రాప్‌లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
Congress New Rules : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్‌లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ