న్యూఢిల్లీ, ఆగస్టు 20: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా పిలువరాదని సుప్రీంకోర్టును డీఎంకే అభ్యర్థించింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దుచేయాలని బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను డీఎంకే వ్యతిరేకించింది. ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైనదని తెలిపింది. ప్రస్తుత పిటిషన్‌కు మెరిట్ లేదని, ప్రత్యర్థి పార్టీపై పై చేయి సాధించేందుకు ఈ పిటిషన్ వేశారని ఆరోపించింది. సంక్షేమ పథకాలను ఉచితాలుగా వర్గీకరిస్తే.. ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రతి సేవ ఉచితాలుగానే పిలువాల్సి వస్తుందని అభిప్రాయపడింది.