న్యూఢిల్లీ: 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఎన్సీఈఆర్టీ సరికొత్త మూల్యాంకన నమూనాను ప్రతిపాదించింది. ఇందులో విద్యార్థులు 9 నుంచి 11 తరగతుల వరకు సాధించిన మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాల్లో వెయిటేజీ ఇవ్వడంతోపాటు వృత్తివిద్యకు, నైపుణ్య ఆధారిత శిక్షణకు మరింత ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నది. ఎడ్యుకేషన్ బోర్డుల మధ్య సమానత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా రూపొందించిన ఓ నివేదిక నుంచి ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 12వ తరగతి ఫైనల్ ఫలితాల్లో గరిష్ఠంగా 9వ తరగతి నుంచి 15 శాతం, 10వ తరగతి నుంచి 20 శాతం, 11వ తరగతి నుంచి 25 శాతం మార్కులను కలపాలని ఇది సూచించింది.