భారత్ ఊబకాయుల నిలయంగా మారుతున్నదని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. 2050 నాటికి దేశంలో 45 కోట్ల మంది ఊబకాయులు ఉంటారని అంచనా వేసింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా వయోజనులు ఊబకాయం బారినపడతారని తేల్చింది. 2021లో చైనా తర్వాత భారత్లోనే స్థూలకాయులు ఎక్కువగా ఉన్నారని తెలిపింది. పిండి పదార్థాలు, తీపి పదార్థాలను తినడం తగ్గించి, ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోకపోతే యువత, పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరించింది.