Asaduddin Owaisi : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan) లోని, పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన భారత సేనలను, కేంద్ర ప్రభుత్వాన్ని తాను అఖిలపక్ష భేటీ (All party meet) లో అభినందించానని ఏఐఎంఐఎం చీఫ్ (AIMIM chief) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చెప్పారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని తాను ప్రభుత్వానికి సలహా ఇచ్చానని అసదుద్దీన్ అన్నారు. అంతేగాక ఆర్టీఎఫ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని అమెరికాను కోరాలని కూడా తాను కేంద్రానికి సూచించానని చెప్పారు. అదేవిధంగా పాకిస్థాన్‌ను ‘ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)’ లో గ్రే లిస్టులో పెట్టేలా ప్రయత్నాలు చేయాలని అభిప్రాయపడ్డారు. దాంతో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు నిధులు రాక కష్టమవుతుందని తెలిపారు.