చంఢీగఢ్, డిసెంబర్ 24: కేంద్రంతో జరుగుతున్న యుద్ధంలో గెలవాలంటే దేశమంతా ఐక్యంగా పోరాడాలని పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్(70) మంగళవారం పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్ల సాధన కోసం 29 రోజులగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన శంభులోని రైతుల నిరసన స్థలిలో ప్రత్యేక వేదిక నుంచి రెండు నిమిషాలు మాట్లాడారు. ‘మనం ఈ యుద్ధం గెలవాలి.
దేశమంతా ఐక్యంగా పోరాడితేనే ఈ యుద్ధం గెలవగలం. మనల్ని ప్రభుత్వం ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లగొట్ట కూడదని నేను కోరుకుంటున్నా. అలా జరిగితే మనం గెలుస్తాం లేదా చస్తాం. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది’ అని ఆయన బలహీన స్వరంతో తెలిపారు.