పట్నా: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్‌పై కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తున్నదని ఆయన మండిపడ్డారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బీహార్ రాష్ట్రం ముందంజలో ఉన్నదని, దీనికితోడు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదని వ్యాఖ్యానించారు.
కేంద్రం సర్కారు బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. దేశంలోని టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచేదని తేజస్వియాదవ్ అభిప్రాయపడ్డారు. కానీ నరేంద్రమోదీ సర్కారు పక్షపాత వైఖరితో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపించారు.