Arvind Kejriwal : తాము నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ (APP convener) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) అన్నారు. పంజాబ్ (Punjab) లోని ఆనంద్పూర్ సాహిబ్ (Anandpur Sahib) లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రజలు అడుగుతున్నారని, ప్రభుత్వ నిధులను పూర్తిగా ప్రజల కోసమే వినియోగిస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కానివ్వడంలేదని చెప్పారు.
తాము గురు మహరాజ్ సాహిబ్ మార్గంలో నడుస్తున్నామని, తప్పుచేసి ఉంటే ఆయన తమను శిక్షిస్తారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చింది డబ్బు సంపాదించడం కోసం కాదని, మంచి పేరు సంపాదించడం కోసమని కేజ్రీవాల్ అన్నారు. తాము పెద్దపెద్ద బంగ్లాలు నిర్మించుకోవడం కోసం రాలేదని, గురు మహరాజ్ ఆశీర్వాదాల కోసం వచ్చామని తెలిపారు.