కోల్‌కతా: ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన నిరుద్యోగ యువతను పోలీసులు చితకబాదారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉద్యోగాల కోసం ఫారాలు సమర్పించేందుకు బెర్హంపూర్ స్టేడియానికి భారీగా నిరుద్యోగులు వచ్చారు. అయితే క్యూలో సరిగా నిలబడని యువకులపై పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది లాఠీలతో దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | West Bengal | Police baton-charge on youth who were not standing in a queue to submit forms for jobs in the Berhampore Stadium of Murshidabad district pic.twitter.com/AEuCvyPayA
— ANI (@ANI) December 4, 2021
కాగా, ఇలాంటి తరహా మరో ఘటన పంజాబ్‌లో జరిగింది. బటిండాలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌ను ఘెరావ్ చేయడానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రయత్నించారు. దీంతో పంజాబ్ పోలీసులు ఆ కాంట్రాక్టు ఉద్యోగుల కాళ్లు, చేతులు పట్టుకుని అక్కడి నుంచి లాక్కొనిపోయారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Punjab Police remove contractual employees from the spot while they were going to gherao state's finance minister Manpreet Singh Badal in Bathinda pic.twitter.com/Vv54Xnj2aA
— ANI (@ANI) December 4, 2021