Wayanad : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని విడిచిపెడతారని వస్తున్న వార్తలు బాధాకరమని కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కే సుధాకరన్ అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహించేందుకు వయనాడ్‌కు పరిమితం కాలేరని ఆయన వ్యాఖ్యానించారు.
రాహుల్ వయనాడ్‌ను వీడుతున్నారని బాధపడుతూ ఓ మహిళ కన్నీరు కార్చడంతో తానూ చలించిపోయానని అన్నారు. రాహుల్ నిర్ణయం ఏదైనా మనం విచారించాల్సిన పనిలేదని అన్నారు.
కాగా అంతకుముందు వయనాడ్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను రాయ్‌బరేలి, వయనాడ్ స్ధానాల్లో ఏది నిలుపుకోవాలనే దానిపై ఎటూ తేల్చుకోలేని స్ధితిలో ఉన్నానని చెప్పారు. తనకు దేశంలోని పేదలు, వయనాడ్ ప్రజలే దేవుళ్లని ఆయన వ్యాఖ్యానించారు.
Read More :
Pawan Kalyan | చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పవన్ కళ్యాణ్