ముంబై : ఇంటర్నెట్లో (Viral Video) చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్లు కనిపిస్తూ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంటాయి. మూవీ థియేటర్లు, గేమ్స్ వీక్షించే సందర్భంలోనూ చిన్నా పెద్దా అందరూ ఇష్టంగా తినే పాప్కార్న్నూ వెరైటీ ఫుడ్ కాంబో ట్రై చేసే వారు విడిచిపెట్టలేదు. వాటర్మెలన్ పాప్‌కార్న్‌ను తయారుచేసే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే ఈ స్నాక్ టేస్ట్ గురించి మాత్రం పెదవివిరిస్తే చేసేదేమీ లేదు. ఓ ఇన్స్టాగ్రాం ఫుడ్ పేజ్ ఈ వైరల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వేడిచేసిన ప్యాన్‌పై పుచ్చకాయ ముక్కను కుక్ ఉంచడం కనిపిస్తుంది. ఆపై షుగర్‌తో పాటు కార్న్‌ను అందులో వేసి ఉడికించడం కనిపిస్తుంది.
కొద్ది సెకండ్ల వ్యవధిలో కార్న్స్ ఎరుపు రంగు నీటిలో కలిసిపోతాయి. పాన్ మూత పెట్టిన కొద్దిసేపటికి వాటర్మెలన్ పాప్‌కార్న్ రెడీ అవుతుంది. ఇంట్లో తయారుచేసిన వాటర్మెలన్ పాప్‌కార్న్, స్వీట్ అండ్ క్రిస్పీ! సూపర్ డెలీషియస్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Read More :