Health Tips | లెమన్ వాటర్ ఆరోగ్యానికి మేలు చేసినా పరిమితి మించితే..!
రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం (Health Tips) తీసుకుంటే బరువు తగ్గడం, జీర్ణవ్యవస్ధ మెరుగవడడం నుంచి విటమిన్ సీ అందడం వరకూ ఎన్నో ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయని చెబుతుంటారు.
న్యూఢిల్లీ : రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం (Health Tips) తీసుకుంటే బరువు తగ్గడం, జీర్ణవ్యవస్ధ మెరుగవడడం నుంచి విటమిన్ సీ అందడం వరకూ ఎన్నో ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే లెమన్ వాటర్‌ను మితంగా తాగుతూ ఆరోగ్య సమస్యలను బ్యాలెన్స్ చేస్తూ ఉండాలని అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి అనర్ధదాయకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మరసం అతిగా తాగితే గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బంది ఎదురవుతుంది.
నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎక్కువగా తీసుకుంటే అసిడిటీ లెవెల్స్ పెరిగి జీర్ణసమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక లెమన్ వాటర్ రుచిగా ఉన్నా పంటి ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. రోజూ నిమ్మరసం తీసుకుంటే అందులో ఉండే ఆమ్లాలు పన్నును మరింత సెన్సిటివ్‌గా మార్చుస్తాయి. ఎనామిల్‌ను కాపాడుకునేందుకు నిమ్మరసాన్ని తరచూ తీసుకోకుండా జాగ్రత్తపడాలి. లెమన్ వాటర్ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు లోనవదని చెబుతుంటారు. ఇది నిజమే అయినా నిమ్మరసం అధికంగా తీసుకుంటే ఇందుకు విరుద్ధమైన ఫలితాలు కనిపిస్తాయి.
నిమ్మరసంలో ఉండే డీటాక్సిఫైయింగ్ పదార్ధాలతో శరీరంలో కీలక ఎలక్ట్రోలైట్స్ విసర్జించబడి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇక లెమన్ వాటర్‌లో ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని అధికంగా తీసుకుంటే ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిమ్మరసాన్ని మితంగా తీసుకుంటే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. నిమ్మరసం తీసుకుంటే కొందరిలో అల్సర్, హార్ట్‌బర్న్ వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. ఏదైనా లెమన్ వాటర్ పూర్తి ప్రయోజనాలను పొందాలంటే పరిమిత మోతాదులో తీసుకుంటూ సమతూకం పాటించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

