Health tips | ఆరోగ్యానికి మంచిదని మనం మార్కెట్లో కొనే ప్రతి ఆహారం.. నిజానికి ఏమంత మంచిది కాకపోవచ్చు!
అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది. తినే తిండిలో మరిన్ని పోషకాలు ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. అయితే, ‘ఆరోగ్యానికి మంచిది’ అనుకుంటూ మనం మార్కెట్లో కొనే ప్రతి ఆహారం, నిజానికి ఏమంత మంచిది కాకపోవచ్చు.
Health tips | అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది. తినే తిండిలో మరిన్ని పోషకాలు ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. అయితే, ‘ఆరోగ్యానికి మంచిది’ అనుకుంటూ మనం మార్కెట్లో కొనే ప్రతి ఆహారం, నిజానికి ఏమంత మంచిది కాకపోవచ్చు. అందుకే ఏది ఉపయోగకరమో, ఏది కాదో తెలుసుకొని తింటే మంచిది.
ఎండుద్రాక్ష
అనుకున్నంత ఆరోగ్యకరం కాదు. ఎండబెట్టడంతో వీటిలో ఉండే చక్కెర మూడు రెట్లు పెరుగుతుంది. మధుమేహ రోగులు మరింతదూరం ఉండాల్సిందే.
డైట్ సోడా
ఇదొక మార్కెటింగ్ ఎత్తుగడ. మిగిలిన సోడాలతో పోలిస్తే ఇందులో చక్కెర తక్కువ అనుకుంటారు. శుద్ధ్ద అబద్ధం. అంతేకాదు, కృత్రిమ రుచులూ అధికమే. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
అరటికాయ చిప్స్
వీటిలో ఎలాంటి పోషకాలూ ఉండవు. కేలరీలు, చక్కెరలను పెంచేస్తాయి. అరటికాయ చిప్స్ కంటే అరటిపండే ఉత్తమం.
ఫ్లేవర్డ్ యోగర్ట్
ప్రొబయోటిక్ గ్రీక్ యోగర్ట్ మంచి స్నాక్స్. కానీ ఫ్లేవర్డ్ యోగర్ట్‌లో ఎన్నో యాడిటివ్స్ ఉంటాయి. కాబట్టి, మామూలు యోగర్టే మంచిది.
పండ్లరసాలు
మార్కెట్లో దొరికే ఫ్రూట్ జ్యూస్ 100 శాతం పండ్లతోనే తయారైనవి కాదు. వాటిలో చక్కెరలు అధికం. మన రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి.
లైట్ సలాడ్ డ్రెసింగ్
వీటిలో కూడా ఫ్లేవర్ కోసం ఎన్నో జోడింపులు చేస్తారు. కాబట్టి ఇంట్లో ఆలివ్ నూనె, వెనిగర్‌తో సలాడ్ చేసుకోవడం ఉత్తమం.
ప్యాకేజ్డ్ సూప్స్
చాలా సూప్స్‌లో ఉప్పు, చక్కెరలు ఎక్కువ. ఇంట్లో మనకు నచ్చినట్టు చేసుకునే చికెన్, కూరగాయల సూపులే ఆరోగ్యానికి మంచివి.
ప్రొటీన్ బార్లు
ఇది కూడా మార్కెట్ మాయాజాలమే. వీటిలో చక్కెర ఎక్కువ. కాబట్టి, అన్ని ప్రొటీన్ బార్లూ ఆరోగ్యానికి మంచివి కాదు. కొనేటప్పుడు లేబుల్స్ జాగ్రత్తగా చదవాలి. వీటికంటే సహజమైన ప్రొటీన్లు ఇచ్చే పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

