Crime news : ఓ హౌసింగ్ సొసైటీ (Housing Society) కి వాచ్మెన్ (Watch man) గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. హౌసింగ్ సొసైటీ పరిసరాల్లోని నీళ్ల డ్రమ్ములో అతను శవమై కనిపించాడు. మహారాష్ట్ర (Maharastra) లోని థానే జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి థానేలోని మీరా రోడ్ ఏరియాలోగల ఓ హౌసింగ్ సొసైటీలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి నిద్రించిన సింగ్.. తెల్లారేసరికి సొసైటీ సమీపంలోని నీళ్ల డ్రమ్ములో శవమై ఉన్నాడు. తక్కువ నీళ్లు ఉన్న డ్రమ్ములో సగం మునిగిన, సగం తేలిన స్థితిలో కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, దర్యాప్తులో మృతికి గల కారణాలు వెల్లడవుతాయని అన్నారు.