కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం ‘కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (KIFF)’ జరిగింది. ఈ ఫిలిం ఫెస్టివల్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జితోపాటు, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మమతాబెనర్జితో కలిసి సినీ దర్శకుడు మహేశ్‌భట్, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, సోనాక్షి సిన్హా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు..