Mamata banerjee : పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రేపు అక్కడ ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి ఆమె హాజరుకానున్నారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మమతాబెనర్జి గురువారమే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.
కానీ, ఆఖరి నిమిషంలో ఆమె తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దాంతో ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు సీఎంలు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించినందుకే మమత కూడా తన నిర్ణయం మార్చుకున్నారని ప్రచారం జరిగింది. కానీ అది తప్పుడు ప్రచారం అని రుజువు చేస్తూ మమతాబెనర్జి ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee arrives at Delhi airport
She will attend the NITI Aayog meeting, tomorrow. pic.twitter.com/3hiZhymMCj
— ANI (@ANI) July 26, 2024
దేశంలోని ప్రముఖ నాయకుల్లో మమతా బెనర్జి ఒకరని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రేపు ఆమె నీతి ఆయోగ్ సమావేశంలో తన గళాన్ని బలంగా వినిపిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సామాన్యులపై అకృత్యాలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. మిత్రపక్షాలకు అనుకూలంగా బడ్జెట్ను రూపొందించారు. తెలంగాణ, బెంగాల్ సహా పలు రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం చేశారు. వీటన్నింటిని మమత నీతి ఆయోగ్ సమావేశంలో లేవనెత్తుతారు’ అని టీఎంసీ ఎంపీ శతృఘ్న సిన్హా చెప్పారు.