Anil Kumble: అయోధ్య నగరం పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరంలో ఎటు చూసినా యజ్ఞాలు, యాగాలే జరుగుతున్నాయి. భక్తుల భజన పాటలతో అయోధ్య హోరెత్తుతోంది. సోమవారం అంగరంగవైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక గీతాలు మార్మోగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతోపాటు సామాన్య భక్తులు కూడా భారీగా తరలివెళ్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, కొందరు సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు.
తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సైతం తన సతీమణితో కలిసి అయోధ్యకు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం లక్నోకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లనున్నారు. లక్నోలో అనిల్ కుంబ్లే తన సతీమణితో కలిసి ఎయిర్పోర్టు నుంచి బయటికి వస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.