Mpox : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వైరస్ అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 15,600 మందికి సోకగా.. అందులో 537 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 96 శాతం మంది కాంగో దేశానికి చెందిన వారే ఉన్నారు. ఇటీవల పాకిస్థాన్లో కూడా మంకీపాక్స్ కేసు నమోదైంది.
దాంతో భారత్ అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో దేశంలో మంకీపాక్స్ ప్రవేశించే అవకాశాలపై చర్చించారు. అదేవిధంగా ఒకవేళ మంకీపాక్స్ వస్తే దాన్ని అడ్డుకోవడం ఎలా, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి..? అనే అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.
#WATCH | Union Minister of Health & Family Welfare JP Nadda reviews the Monkeypox situation and preparedness
Cautionary measures to be put in place to prevent and control the spread of the disease. No reported cases of Monkeypox in India as of now
(Video Source: Ministry of… pic.twitter.com/vW82bKODWE
— ANI (@ANI) August 17, 2024