Fire accident: మహారాష్ట్రలోని పుణె జిల్లా చించ్వాడ్లోని వల్హెకర్వాడి ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 2.55 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గోదాముల నుంచి అగ్ని కీలలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.