న్యూఢిల్లీ: చంద్రుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు పంపిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చందమామకు మరింత దగ్గరైంది. ఈ నెల 23 లేదా 24వ తేదీన చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ కాబోతున్నది. ఈ క్రమంలో చంద్రయాన్-3 మిషన్‌లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (LPDC) చంద్రుడి ఉపరితలాన్ని వీడియో తీసింది.
ఎల్పీడీసీ కెమెరాకు చిక్కిన ఈ చిత్రాలు ఆగస్టు 15 నాటివని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ తీసిన తాజా చిత్రాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
కాగా, భారత్, రష్యా దేశాలు పోటీపోటీగా చంద్రుడిపై అధ్యయనానికి పూనుకున్నాయి. అనుకున్నదే తడవుగా రెండు దేశాలు తమతమ స్పేస్‌క్రాఫ్ట్‌లను వేర్వేరుగా అంతరిక్షంలోకి పంపాయి. అయితే, ఈ రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లలో ఏది ముందు చంద్రుడి ఉపరితలంపై దిగుతుందనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశం అయ్యింది.
#WATCH | The Moon as seen by Lander Position Detection Camera (LPDC) onboard Chandrayaan-3 on 15th August
(Video source: ISRO) pic.twitter.com/T1VgyrDuTf
— ANI (@ANI) August 18, 2023