ఈ వీడియోను చూస్తే మీ రోమాలు నిక్కపొడవాల్సిందే. స్కూటీలోకి దూరిన ఓ నాగుపాము.. అందర్నీ తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. పాములు పట్టే వ్యక్తి మాత్రమే దాన్ని చివరకు పట్టుకోగలిగాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విటర్ పేజీలో పోస్టు చేశారు.
తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్‌గిరికి చెందిన ఓ వ్యక్తి స్కూటీ ముందు భాగంలో నాగుపాము దూరింది. దీన్ని గమనించిన అతను తీవ్ర భయాందోళనకు గురై పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. అతను అక్కడికి చేరుకుని పామును క్షణాల్లో పట్టేశాడు. ఆ పామును పట్టుకుంటున్న సమయంలో స్థానికులంతా తమ సెల్ఫోన్లకు పని చెప్పారు. ఆ దృశ్యాలను ప్రతి ఒక్కరూ చిత్రీకరించి వైరల్ చేశారు.
ఈ వీడియోను సుశాంత నంద పోస్టు చేస్తూ.. వర్షకాలంలో కొన్ని గెస్టులు రావడం సహజం. ఇలాంటి వాటిని ఒక పద్ధతి లేకుండా పట్టేందుకు ట్రై చేస్తే ప్రమాదం తప్పదు. పాములను పట్టేందుకు ఎప్పుడూ కూడా ట్రై చేయొద్దు అని, నైపుణ్యం గల వ్యక్తులే పాములను పట్టగలరని ఆయన ట్వీట్ చేశారు.
Such guests during rains are common…
— Susanta Nanda IFS (@susantananda3) September 7, 2021
But uncommon is the method used to rescue it. Never ever try this😟 pic.twitter.com/zS4h5tDBe8