అమృత్సర్: దేశవ్యాప్తంగా భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. ఈ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఘనంగా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో సైనికుల విన్యాసాలు అబ్బురపరిచాయి. మహిళ సైనికులు కూడా ఈ వేడుకలో అద్భుతమైన విన్యాసాలను చేసి చూపించారు. ఈ బీటింగ్ రిట్రీట్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | The beating retreat ceremony underway at the Attari-Wagah border in Punjab’s Amritsar on the occasion of #IndependenceDay pic.twitter.com/YCfRtTzFQ7
— ANI (@ANI) August 15, 2023