Dust storm : దేశ రాజధాని ఢిల్లీ వాసులను వరుసగా రెండో దుమ్ము తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. గురువారం సాయంత్రం కూడా ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ చెలరేగింది. పలుచోట్ల వర్షం కూడా పడింది. దాంతో 40 డిగ్రీలకు పైగా ఉన్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఢిల్లీ చల్లబడిపోయింది. అదేవిధంగా ఇవాళ సాయంత్రం కూడా ఢిల్లీలో దుమ్ముతుఫాన్ చెలరేగింది.
ఢిల్లీతోపాటు పరిసరాల్లోని నోయిడా, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా ఆకాశం మేఘావృతమై డస్ట్ స్టార్మ్ పడింది. ఇవాళ ఉదయాన్నే కూడా ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణ కేంద్రం కూడా ఢిల్లీలో ఇవాళ చిరు జల్లులతోపాటు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఢిల్లీలో డస్ట్ స్టార్మ్కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Several parts of Delhi experience dust storm this evening. Visuals from VP House.
(via : ANI) pic.twitter.com/E3IhxV5lbB
— Hindustan Times (@htTweets) April 11, 2025