Baglihar Dam : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య చర్యప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఎగుమతులు, దిగుమతులపై నిషేధాలు.. విమానాల రాకపోకలను అడ్డుకునేందుకు గగన తలాల మూసివేత లాంటి చర్యలు రెండు దేశాలు పోటీపడి చేపడుతున్నాయి.
ఈ క్రమంలో భారత్ ఒకడుగు ముందుకేసి పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేసింది. అందులో భాగంగా భారత్‌లోని వివిధ డ్యామ్‌ల నుంచి నీటి విడుదలను కట్టడిచేసింది. అన్ని ప్రాజెక్టుల గేట్లను మూసివేసింది. ప్రస్తుతం రాంబన్ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన బాగ్లిహార్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నుంచి మాత్రం స్వల్పంగా నీరు దిగువకు విడుదలవుతోంది. ఒక గేటు మినహా మిగతా గేట్లన్నీ పూర్తిగా మూతపడ్డాయి.
#WATCH | J&K | Some amount of water continues to flow out of the Baglihar Hydroelectric Power Project Dam built on the Chenab River in Ramban. All gates of the dam remain closed. pic.twitter.com/UO03tgWMI9
— ANI (@ANI) May 6, 2025