Bridge damage : కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాలక్కాడ్ జిల్లాలోని ఓ నదిలో వరద ఉధృతికి ఆ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. దాంతో నదికి ఇరువైపుల ఉన్న ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా కోజికోడ్ జిల్లాలో కూడా భారీ వర్షంవల్ల వరదలు పోటెత్తాయి.
#WATCH | River in full spate damages bridge in rain-ravaged Palakkad in Kerala pic.twitter.com/NOhuhN6GuZ
— ANI (@ANI) July 30, 2024
కాలువలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఈ ఎడతెరపిలేని వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. కొండ చరియలను తొలగించినా కొద్ది ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మధ్యాహ్నం వరకు మృతుల సంఖ్య 60 దాటింది.
#WATCH | Canals overflowing, roads waterlogged, houses inundated in Kerala’s Kozhikode as a result of heavy rainfall in the area pic.twitter.com/dPZG1eqYxt
— ANI (@ANI) July 30, 2024